ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో |
మాకు గతి శ్రీరామ చరణం రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి మాకు గతి శ్రీరామ చరణం మాకు శరణం రామ చరణం మాకు చాలును మౌనిమస్తకభూషణంశ్రీరామచరణం రాగయై ఈబ్రతుకుచెడి రాయైనవేళల రామచరణం మూగయైపెనుధూళిపడి మోడైనవేళల రామచరణం ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం మాకు చాలును జరయు మరణం రాకబ్రోచే రామ చరణం కోతియై ఈమనసునిలకడ కోలుపోతే రామచరణం సేతువై భవజలధితారణహేతువౌ శ్రీరామచరణం ఏడుగడశ్రీరామచరణం తోడుపడ శ్రీరామచరణం మాకు చాలును ముక్తిసౌధప్రాంగణం శ్రీరామ చరణం దారువులకును రాజ్యనిర్వహదర్పమిచ్చే రామచరణం బీరువులకును అరినెదిర్చే బీరమిచ్చే రామచరణం ధైర్యమిచ్చే రామచరణం స్థైర్యమిచ్చే రామచరణం మాకుచాలు మహేంద్రవైభవతారణం శ్రీరామచరణం |
www.maganti.org |