ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో
ఎక్కడినుండో ఈ పిలుపు

రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఎక్కడి నుండో ఈ పిలుపు
ఎందుకు నాకీ మైమరపు
అందుండి ఇందుండి ఉండుండి ప్రతి పొదనుండి ... ఎక్కడి...

ఒకసారి మరీ దగ్గరగా వడివడిగా
ఒకసారి లేత సవ్వడిగా సడిసడిగా
ఒక క్షణమేని ఊరుకోదు
సుఖముగా నిదురపోనీదు ... ఎక్కడి...

ఎవరిదో పిలుపు తెలియదు
ఎవ్వరో చూడనే లేదు
మనసు మనసుపై ఒదిగీ ఒదిగీ
మధుర రహస్యం ఊదినట్లు ... ఎక్కడి...

www.maganti.org