ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో
ఓ మలయ పవనా

రచన: చిల్లర భవాని

ఓ మలయ పవనా ఓహో మలయపవనా (2)
ఆమలయానిల వీచికలో ఊగిపోదు మధుడోలికలో
తేలిపోదు మధురోహలలో తేనెలొలుకు సుమభావనలో ... ఓ మలయ పవనా

అదిగో చల్లని వెలుగదిగో తూరుపుకొండల వెలుగదిగో
బాలభాస్కరుని రాగజ్యోతి ప్రపంచమునకే జీవనజ్యోతి ... ఓ మలయ పవనా

www.maganti.org