ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో
మోగించెలే మురళి మోగించెలే

రచన: సినారె

సంగీతం – పెండ్యాల

గానం – వేదవతీ ప్రభాకర్

మోగించెలే మురళి మోగించెలే (2)
ఆమురళీగానామృతధారలు
నామది దోచెనె ఓచెలి .... మోగించెలే

గోపీ కృష్ణుని రూపమునల్లన
మూపున దాల్చిన కంబళి నల్లన
జలజలపారే యమునా జలములు
శ్యామసుందరుని ఛాయ నల్లన ..... మోగించెలే

మురళీరవళి నా చెవుల సోకగా
పరవశించెనే తనువెల్లా
మీరా గుండెల రగిలే వేదన
వారింపరా గిరిధర గోపాలా ..... మోగించెలే

www.maganti.org