ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో
ఆడెను మీరా

రచన: సినారె

సంగీతం – పెండ్యాల

ఆడెను మీరా ఆడెను మీరా
అందెలు ఘల్లనగా
కాలి అందెలు ఘల్లనగా (3)

బంధువులన్నారు కులనాసీయని
పలికిరి లోకులు ఉన్మాదీయని
తెలియలేరు వీరెవరూ మీరా
హరిచరణాంబుజ దాసియని .... ఆడెను మీరా

www.maganti.org