ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో |
నీ జాడ కననైతిరా రచన: కందుకూరి రామభద్రరావు (?) నీ జాడ కననైతిరా .. వేరేడు శయనింతురా నా స్వామీ పూలమావులలోని మేలితావులలోని గాలి ఈలలు వేసెరా నా స్వామీ చాలావేడిగ వీచెరా ................ నీజాడ వేయికన్నుల తోటి వేచి వేచిన కలువ విసిగి కన్నులు మూసెరా నాస్వామి వెలది వెన్నెల మాసెరా ................ నీజాడ దూరాన జలదాల దూరేటి నెలబాల ఏలకో హసియించెరా నా స్వామీ ఎగతాళి అనిపించెరా ................ నీజాడ |
www.maganti.org |