వేసవి వర్ణనచెలరేగకేయుక్క నీ తలబట్టి చలినుక్క
తలపకుమాచిర్ర నిను దరుము విసరుకర్ర
చెలరేగకేయుక్క నీ తలబట్టి చలినుక్క
తలపకుమాచిర్ర నిను దరుము విసరుకర్ర

అనుసరించకెనల్లి నిన్నట్టెమ్రింగు బల్లి
ననుదాకకే యీగ నిను బనసజిగటలాగ
అనుసరించకెనల్లి నిన్నట్టెమ్రింగు బల్లి
ననుదాకకే యీగ నిను బనసజిగటలాగ

పగబూనకే చీమ నిను బట్టినేలపామ
పొగరెందుకే దోమ నిను బొగజంపును జూమ
పగబూనకే చీమ నిను బట్టినేలపామ
పొగరెందుకే దోమ నిను బొగజంపును జూమ

ఎగరకుమాధూళి యి ల్లిదిగోవర్షాళి
యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్కపీక
ఎగరకుమాధూళి యి ల్లిదిగోవర్షాళి
యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్కపీక