వైరాగ్య తత్త్వం


*******************************************************
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా


వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
ప్రమిదలో నూనె ఉన్నవరకే దీపమెలుగునంట
ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా


వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనంట
మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
*******************************************************

Keywords: tattvam, tattvAlu, vairAgya tattvam, pUcika pulla, tOlubomma, marmam, aaSa