సీతమ్మవారికి, హనుమ తెచ్చిన ఉంగరానికి జరిగిన సంభాషణ మన జానపదులు ఎంత హృద్యంగా తీర్చిదిద్దారో చూడండి. ఈ పదం నాకు పంపించిన మాలినిగారికి ధన్యవాదాలతో . |
******************************************************* |
ఉంగారమా ముద్దుటుంగారమా |
మా రంగయిన రాములేలుంగారామా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
యే కాకెత్తుకొచ్చేన ఉంగారమా |
నిన్ను గద్దెత్తుకొచ్చేన ఉంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
కాకెత్తుక రాలేదు ఉంగారమా |
నన్ను గద్దెత్తుక రాలేదు ఉంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
మరి యేదోవ నొస్తివే ఉంగారమా |
నీవే దోవనొస్తివే ఉంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
రామయ్య అంపగా ఉంగారమా |
హనుమయ్య తెచ్చెనే నన్ను ఉంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
ఉంగారమా ముద్దుటుంగారమా |
******************************************************* |