సువ్విపాట

నా చిన్నప్పుడు ఎప్పుడో విన్న ఒక సువ్విపాట ఇదిగో. పంపించిన మా పెద్దమ్మ అమ్మనమంచి సుబ్బమ్మగారికి ధన్యవాదాలు.

సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణసాంద్ర
సువ్విసీతారామచంద్ర సువ్విలాలీ
సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణసాంద్ర
సువ్విసీతారామచంద్ర సువ్విలాలీ

సంసారమనునట్టి సాగరమ్ములోనబెట్టి
హింసబెట్ట తగదునీకు కంసచాణూరమర్దనా
సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణసాంద్ర
సువ్విసీతారామచంద్ర సువ్విలాలీ

ఆసించియున్నాను వాసుదేవా విబుధజన
దాసపోష దోషనాశ దశవేషా
సువ్విరార సుందరాంగ సువ్విధీర సుగుణసాంద్ర
సువ్విసీతారామచంద్ర సువ్విలాలీ