శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు తెగగొట్టగా, తన అన్న రావణుని వద్దకు వెళ్ళి తన అవమానానికి ప్రతీకారంగా సీతని చెరబట్టమని అడిగే ఈ చెక్కభజన పాట చూడండి |
******************************************************* |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
చిత్రకూట వనములోన జరిగినసంగతీ నాయకా |
చిత్రకూట వనములోన జరిగినసంగతీ నాయకా |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
దశరధాపుత్రులంటా రామలక్ష్మణులిద్దరూ |
దశరధాపుత్రులంటా రామలక్ష్మణులిద్దరూ |
వారితో కలియరమ్మని కష్టపెట్టిరి మనుజులు |
వారితో కలియరమ్మని కష్టపెట్టిరి మనుజులు |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
ఒప్పుగా నే విన్నవించితి గొప్పవారనుకొంటినీ |
ఒప్పుగా నే విన్నవించితి గొప్పవారనుకొంటినీ |
గొప్పవారు తాము కాదని బలమునా నన్ను బట్టిరీ |
గొప్పవారు తాము కాదని బలమునా నన్ను బట్టిరీ |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
బలమునా నను బట్టిరీ నాకు భంగము కావించిరీ |
బలమునా నను బట్టిరీ నాకు భంగము కావించిరీ |
ముకు చెవులు కోసెనా వాని తమ్ముడు లక్ష్మణా |
ముకు చెవులు కోసెనా వాని తమ్ముడు లక్ష్మణా |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
సీత అన్న పడతి ఉన్నది ఆమె రూపము |
సీత అన్న పడతి ఉన్నది ఆమె రూపము |
చెప్పశక్యము కానిదీ చెప్పశక్యము కానిదీ |
చెప్పశక్యము కానిదీ చెప్పశక్యము కానిదీ |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
ఆమె లావణ్యము వర్ణించుట బ్రహ్మతరములు కానిదీ |
ఆమె లావణ్యము వర్ణించుట బ్రహ్మతరములు కానిదీ |
ఎటులయిన ఆ సీతనిప్పుడు వేగమే చెరపట్టుమా |
ఎటులయిన ఆ సీతనిప్పుడు వేగమే చెరపట్టుమా |
అన్న రావణ ఆలకింపుము విన్నవించెద నాయకా |
******************************************************* |