ఎందుకురా పెళ్ళి ఎందుకురా!ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
అందగత్తె గయ్యాళి పెండ్లమయిన
అద్దానిమూరెట్టి పెద్దమగండయిన
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా

ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
నీరసించి లేవ నేరక శంకించి
కోరచూపులు చూచి గ్రుక్కెళ్ళు మ్రింగుటకా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా

ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
వండితినని బిల్వనుండ నలుపుతావు
పిండము తింటావు, పండుకొని లేవలేనంటావు
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా

ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
పుట్టతల ముగ్గుబుట్టవలె నెరసి
నట్టేట నున్నట్టి నావవంటివానికి
ఎందుకురా పెళ్ళి ఎందుకురా
ఎందుకురా పెళ్ళి ఎందుకురా


1921 లో శ్రీ బాలాజీదాస్ గారి రచన