మా తల్లిగారయిన శ్రీమతి మాగంటి జ్ఞానప్రసూన గారు పాడిన కొన్ని సంప్రదాయ మంగళహారతి పాటలు, లలిత సంగీతం పాటలు కొన్ని ఇక్కడ వినవచ్చు.ప్రసూన గారు, కొన్ని ఏళ్ళ నుండి ఈ పాటలు పాడకపోయినా నేను కోరిందే తడవుగా, తన సంగీత గురువు, తల్లిగారు అయిన శ్రీమతి కాశీభట్ట కమలమ్మగారికి వందనాలు అర్పిస్తూ, ఓపికగా అన్నీ కాకపోయినా కొన్ని పాటలు గుర్తు తెచ్చుకుని పాడినందుకు ఆవిడకి ధన్యవాదాలతో. రెండో విడతలో మరి కొన్ని పాటలతో మీ ముందుకు..సమయానికి సరి అయిన రికార్డింగ్ సాధనాలు దొరకక,ఒక పాత టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి, అలా రికార్డ్ అయిన పాటలను ఎం.పి.3లుగా రూపొందించగా , ఆ పాటల రూపురేఖలు కొద్దిగా మారినాయి - అంటే బాక్ గ్రవుండ్ శబ్దాలు కానివ్వండి, గాత్రం కానివ్వండి - కొద్దిగా అసౌకర్యమయిన రూపు సంతరించుకున్నాయి, అందుకు క్షంతవ్యుడిని. త్వరలో వీటికి ఒక మంచి రూపు తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాను. |