మంగళహారతి


************************************************************
మంగళముపాడరే రంగలరంగను సంగీతభంగిని !! మంగళము !!
భృంగీశసంగీత భంగీవినోదికి రంగలరంగ సారంగలోచనలు!! మం!!
సంగరహితప్ర సంగముమాగునొ సంగుటమటంచును సంగ శూన్యునకు!! మంగళము !!
రంగదుత్తుంగ తరంగానుగాంగత రంగాలవాలవ రాంగాభి శోభికి!! మంగళము !!
మంగళకైలాస శృంగనివాసికి రంగలరంగ మీరంగన లిప్పుడు!! మంగళము !!
భంగములెల్లనుభంగపరచివే గంగరుణించెడు గంగాభకాంతికి!! మంగళము !!
రంగద్విలాసా రంగపాణికిని శృంగారశృంగాట కాంగాభిశోభికి!! మంగళము !!
మంగళశ్రీసర్వమంగళాసంగికి రంగన్మహోక్షతు రంగునకి మీరు !! మంగళముపాడరే !!
************************************************************
శ్రీ మల్లంపల్లి భైరవమూర్తిగారు కూర్పు చేసిన శ్రీ తిరుపతి వేంకట శాస్త్రులవారి పద్యాల సమాహారమయినటువంటి "సూక్ష్మమోక్ష సూచకి" అనే గ్రంథం నుండి తీసుకోబడిన మంగళహారతి పాట ఇది.