కొయ్యోడు పాట


*******************************************************
చీటికి మాటికి చిట్టెమ్మంటే
చీపురుదెబ్బలు తింటవురో రయ్యో కొయ్యోడ
చిన్నోళ్ళుంటరు పెద్దోళ్ళుంటరు
కాపులుంటరు కరణాలుంటరు
నను చిట్టెమ్మ అని పిలువకురో రయ్యో కొయ్యోడ
నే కుందుం నాయుడు కూతుర్నిరో రయ్యో కొయ్యోడ


అబ్బా అబ్బా అలాగయితే
కొయ్యోడంటూ కూశావంటే
కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టమ్మీ
నువ్వు కొరడా దెబ్బలు తింటావే చిట్టమ్మీ
మళ్ళీగాని మాటలాడితే
మడమ తాపులు తింటావే లమ్మీ చిట్టమ్మీ
నే మద్దప్పయ్యా మనవడినే లమ్మీ చిట్టమ్మీ
*******************************************************


Keywords: koyyODu pATa, ciTTemma, maddappayya, kumdum nAyuDu, jAnapada pATa, jAnapada sAhityam, kApulu, karaNAlu