యాదవులు - బొల్లావు


కాటమరాజు కథలో యాదవులు బొల్లావును యే విధంగా అలంకరించారో, దానిని మన జానపదులు తమ పదాలలో ఎంత హృద్యంగా వివరించారో చూడండి.
***************************************
పసిడి బిందెలనీట పాదముల్ కడిగి
అందంబుగా వెదురాకు చందంబున
తిరుమణి తిరుచూర్ణము దిద్దిరి తోడ
నలదిరి మేనున నగరుగంధంబు
నటు పునుగు జవ్వాజి యలదిరి చాల
సురయించి కస్తూరి సురటుల విసిరి
నాల్గుపాదంబుల నాదుటందెలను
మెండుగా వేసిరి మేలుగంటలును
రత్నాలు దాపిన రావిరేకలును
తళతళ మెరియంగ ధరియింపజేసి
కొమ్మున బంగారు కుప్పెను దొడిగి
రహిమించ మెడచుట్టు రంగుగానపుడు
గోమేధికంబుల గొలుసులను వేసె
మురువైన ముత్యాల మువ్వల పేర్లు
గంటల సరసను ఘనముగా వేసె
మూపురమునకు జుట్టు మురువు గజ్జెలును
సన్నగజ్జెలు వేసె సందు సందులను
***************************************
Keywords: kATamarAju katha, yAdavulu bollAvu alankaraNa, gOvula alankaraNa, jAnapada sAhityam, jAnapada pATalu