అనుభావ లక్షణములు
భావములన్నిటినీ యేది స్ఫురణకు తెస్తుందో అది అనుభావం అని చెప్పబడింది. ఇది నాలుగు విధాలు.
- చిత్తజానుభావము
- గాత్రజానుభావము
- వాగారంబానుభావము
- బుధ్యారంబానుభావము
చిత్తజానుభావము - ఇది పది విధములు
1. భావము - నిర్వికారమయిన మనస్సు
2. హావము - భావము కన్నులలో కలుగుట
3. హేల - కన్నులలో నిలిచిన భావాన్ని ఇంచుకంత అభినయించుట
4. శోభ - భావాన్ని అలంకారములతో అభినయించుట
5. కాంతి - భావాన్ని మన్మధ విషయముగా చూపించుట
6. దీప్తి - భావాన్ని భోగములందు ఉపయోగించుట
7. ప్రాగల్భ్యము - ప్రయొగములలో నిశ్శంశయ వృత్తి
8. మాధుర్యము - వ్యాపారములు మృదువుగా చేయుట
9. ధైర్యము - నిర్భయముగా ఉండుట
10. ఔదార్యము - సర్వకాలములలో ఉదారత్వంగా ఉండుట
గాత్రజానుభావము - 10 విధములు
1. లీల - ముద్దుమాటలు
2. విలాసము - నగవద్దికలు కల అంగ విన్యాసములు
3. విచ్ఛత్తి - అలంకారమునకు తగిన చక్కదనము
4. విభ్రమము - ఒక వస్తువును మరి ఒక వస్తువుగా తలచుట
5. కిలికించితము - సంతోషము, భయము, సిగ్గు, చింత ఇవ్వన్నీ కూడిన భావము
6. మోట్టాయితనము - స్వాభిలాషా ప్రకటన
7. కుట్టమితము - లోపల సంతోషంగా ఉన్నా పైకి దుఃఖము చూపించుట
8. బిబ్బోకము - ఇష్టవస్తువులందు అయిష్టము కలుగుట
9. లలితము - సుకుమార అంగ విన్యాసము
10. విహృతము - అడిగిన ప్రశ్నకు క్రియతో ప్రత్యుత్తరం ఇచ్చుట
వాగారంభానుభావము - 12 విధములు
1. ఆలాపము - సంతోషపు మాటలు
2. విలాపము - దుఃఖపు మాటలు
3. సల్లాపము - ప్రశ్నోత్తరవులు కల మాటలు
4. ప్రలాపము - పనికిమాలిన మాటలు
5. అనులాపము - చెప్పినమాటే మరల మరల చెప్పుట
6. అపలాపము - ముందు చెప్పిన మాటను వెనుక తిప్పివేయుట
7. సందేశము - స్నేహితునితో చెప్పుకొను మాటలు
8. అతిదేశము - ఒకరు చెప్పిన మాటలోనే క్రమముగా చెప్పుట
9. నిర్దేశము - నిరూపణము చేసి చెప్పుట
10. అపదేశము - అర్ధాంతరమును తెలియచెప్పుట
11. ఉపదేశము - శిష్యులకు గురువు చెప్పెడి మాటలు
12. వ్యపదేశము - ఇతరవ్యాజముగా చెప్పు మాటలు
బుధ్యారంబానుభావము - 3 విధములు
1. రీతి
2. వృత్తి
3. ప్రవృత్తి
ఇక భావ విశేషాలకు వస్తే
సాత్విక భావం: పరుల కష్టసుఖములందు ఎవని మనసు అనుకూలమగుచున్నదో అది "సత్వం" అనబడును. ఇది 8 విధాలు
1. స్తంభము - నిష్క్రియాంగత్వము
2. స్వేదము - చెమట
3. రోమాంచనము - గగుర్పాటు
4. స్వర భేదము - డగ్గుత్తుక
5. వేపదు - తొందర
6. వైవర్ణ్యము - ముఖతేజస్సు మారుట
7. అశ్రు - కన్నీరు
8. ప్రళయము - ప్రజ్ఞ నశించుట
సంచారీ భావము - 33 విధములు
1. నిర్వేదము - దరిద్ర, సంకట, వియోగములతో కలుగు ఫలాభావము
2. గ్లాని - సురతరోగ వ్యాయామములతో కలుగు దౌర్బల్యము
3. శంక - పరోక్షాపరోక్షములతో నిత్యానిత్యాలు విచారించుట
4. అసూయ - పరుల సంపద చూసి అసహ్యపడుట
5. మదము - సోమహిపాదులచే కలుగు ఆనందసమ్మోహము
6. శ్రమము - నృత్యగమన క్రీడాదులచే కలుగు అలసట
7. ఆలస్యము - నిర్భయతృప్తి గర్వములతో కలుగు కాలవిడంబన
8. దైన్యము - అనేక కారణములతో కలుగు దీనత్వము
9. చింత - ఇష్టవస్తువులు లభింపపోవుటచే కలుగు విచారము
10. మోహము - ఆపద్భయ వియోగములతో మనసుకు ఏమీ తోచని స్థితి
11. ధృతి - గురుశాస్త్రాత్మ బోధలతో కలిగే చిత్తశుద్ధి
12. స్మృతి - యదార్ధ పూర్వామభూతార్ధ జ్ఞానము
13. వ్రీడ - అవమానం, నూతన సంగమం ఇత్యాదులతో కలుగు చింత
14. చపలత - రాగద్వేషాలతో కలుగు చిత్తచలనము
15. హర్షము - ఇష్టసిద్ధితో కలుగు సంతోషము
16. ఆవేగము - పశుగజశకటాగ్ని వర్షాదులతో కలుగు తొందర
17. జడత - విషయాదులతో కలుగు అజ్ఞానము
18. గర్వము - అష్ట ఐష్వర్యాలతో కలుగు అహంభావము
19. విషాదము - ప్రయత్న భంగం అయినప్పుడు కలిగే అనుతాపము
20. ఔత్సుక్యము - విరహాన్ని తాళలేని స్థితి
21. నిద్ర - మంద స్వభావముతో కలిగే చిత్తనిమీలనము
22. అపస్మారము - వాతపిత్తశ్లేష్మాదులతో చెడిన మనసు
23. సుప్తి - నిద్ర యొక్క ఆధిక్యము
24. విభోదము - నిద్ర విడిచి మేల్కొనుట
25. ఆమర్షము - అవమానము మొదలయినవాటితో కలిగే క్రోధము
26. అవహిత్థ - అపరాధము చేయుటచే కలుగు ఆకరగుప్తి
27. ఉగ్రత - క్రోధముచేత కలుగు పరుష వాక్య ప్రయోగం
28. మతి - అనేక శాస్త్రములతో చేయబడిన అర్ధనిర్ణయము
29. వ్యాధి - విరహము, మొదలయిన వాటిచే కలుగు జ్వరము
30. ఉన్మాదము - ఇష్టనాశముచే కలుగు చిత్తవిభ్రమము
31. మరణము - ధనుంజయ వాయువుచే కలుగు నిర్గమము
32. త్రాసము - అసురపిశాచ సర్పాదులను చూచుటచే కలుగు భయము
33. వితర్కము - సత్యాసత్య విచారణ
స్థాయీ భావము - 8 విధములు
1. ఉత్సాహము - సంతోషముచేత చేయు వ్యాపారము
2. శోకము - పుత్ర మిత్ర కళత్ర ధననాశాదులతో కలుగు చింత
3. విస్మయము - లోకోత్తర పదార్ధములను చూచుటచే కలిగే వింత
4. హాసము - శబ్దరూప వికారములతో కలుగు నవ్వు
5. భయము - భయంకర పదార్ధములను చూచుటచే కలుగు వెరగు
6. జిగుప్స - అయోగ్య వస్తువులను చూచుటచే కలుగు అసహ్యము
7. క్రోధము - అవమానములతో కలుగు కోపము
8. రతి - నాయకీనాయికల అన్యోన్యమయిన కలయిక
ఈ పై విశేషాలన్నీ 1911లో శ్రీ నాగభూషణకవి గారు వ్రాసిన రసభావ నాయక సాంప్రదాయము అనే అద్భుతమయిన పుస్తకం నుండి గ్రహింపబడినాయి
Keywords: anubhAva lakshaNamulu, AlApamu, vilApamu, prElApamu, prElApana, upadESamu, anulApamu, vyapadESamu, lalitamu, kilikincitamu, vibhramamu, reeti,nirvEdamu, glAni, vishAdamu, supti, sushupti, vibhOdamu, smruti, smriti, garvamu, harshamu, cinta, mOhamu, dainyamu, aalasyamu, madamu, rasa bhAva nAyaka sampradAyamu, nAgabhUshaNa kavi