" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


కొందరు సాహితీ సేవకే పుడతారని తెలుస్తుంది. ఆ పని చేసి హడావిడిగా వెళ్ళిపోతారెందుకో మరి ! అలా వెళ్ళిపోయిన విమర్శకుడు, కవి అయిన శ్రీ శ్రీ ఆప్త, ఆత్మీయ మిత్రుడి చిత్రమిది ! శ్రీ శ్రీ కి కుడి భుజం, కుడి కన్నూ ఇతడే. "ఉదయిని" పత్రికను నడిపి, నష్టపోయి, ఆరోగ్యం పోగొట్టుకొని అకాల మృత్యువు వాత పడ్డాడు. డా. ఏటుకూరి ప్రసాద్ ఇతనిపై మంచి పుస్తకం రాసేదాకా ఈ ప్రతిభా వంతుని గురించి లోకానికి తెలియదు. ఆధునిక కావ్యాలలో ముప్ఫైసార్లు పునర్ముద్రణ పొందిన ఏకైక కావ్యం "మహాప్రస్థానం" ! ఈ గొప్ప కావ్యాన్ని

"తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం !
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి......!

అంటూ శ్రీ శ్రీ ఇతనికి అంకితమిచ్చాడు. అతనే ఈ చిత్రంలో ఉన్న కొంపెల్ల జనార్దన రావు !

www.maganti.org
All Rights Reserved