" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


తెలుగులో నంది మల్లయ, ఘంట సింగయలు తొలి జంట కవులంటారు. ఆధునికంగా జంటకవులంటే గుర్తుకు వచ్చేది తిరుపతి వేంకట కవులే. అయితే వారితో దీటుగా అవధానాలు చెయ్యకపోయినా - తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవ చేసిన జంట కవుల్ని ఈ చిత్రంలో చూస్తున్నారు. బెంగాలీ భాష నుంచి అపరాధ పరిశోధక నవలలను అనువాదం చేసినవారిలో ఈ జంట కవులే ఆద్యులు. ఆంధ్ర ప్రచారిణీ గ్రంధమాల ద్వారా ఎన్నో నవలల్ని ప్రచురించారు. హరిజన సమస్య పై "మాతృమందిరం" (1919) అనే తొలి నవల రాసిందీ వీరే. అంతే కాదు "ఏకాంత సేవ" అనే విశిష్టమధుర భక్తి కావ్యమూ రాశారు. వీరు వేంకట పార్వతీశ్వర కవులు - అంటే బాలాంత్రపు వేంకట రావు, ఓలేటి పార్వతీశం

www.maganti.org
All Rights Reserved