" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
"కందుకూరి, గిడుగు, గురజాడల భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక సాహిత్య వారసత్వాన్ని సామ్యవాదోన్ముఖంగా తీసుకువెళ్ళి తెలుగు వాళ్ళ సాంస్కృతిక పురోగమనానికి దోహదం చేసిన ఉత్తమ సాహిత్య స్రష్ఠ కొడవటిగంటి కుటుంబ రావు" అని పలికిన ఆచార్య కేతు విశ్వనాధ రెడ్డి మాటల్లో నిజం లేకపోలేదు. 1909 లో జన్మించిన కొడవటిగంటి కుటుంబరావు గారు 1924 లో ఉపనయనం చేసుకున్నారు. మరుసటి సంవత్సరంలో - 1925 లోనే - అంటే పదహారో ఏటనే బాల్య వివాహం చేసుకొన్నారు. కొల్లూరు గ్రామస్తులైన మెట్టా వెంకటరత్న శాస్త్రి, సీతమ్మల కుమార్తె పద్మావతిని కొ. కు. వివాహమాడారు. అప్పుడు పెళ్ళి కూతురు వయసెంతో తెలుసా ? - పదకొండు సంవత్సరాలు మాత్రమే ! ఆ వివాహం నాటి మధురస్మృతిని తెలిపేదే పై చిత్రం |
www.maganti.org All Rights Reserved |