" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
ఎన్ని సాహిత్య సంస్థలున్నా కొన్నిటికే ప్రత్యేకత ఉంటుంది. విశాఖ ప్రాంతాన్ని సాహితీ పరంగా ఒక ఊపు ఊపిన సాహితీ సంస్థ, ఎందరో కవుల్ని, రచయితల్ని, పరిశోధకుల్నీ అందించిన సంస్థను స్థాపించిన ముగ్గురు ప్రముఖుల్ని ఈ చిత్రంలో చూస్తున్నారు. ఈ సాహిత్య సంస్థకు 'కవిగారు' గా పేరుపొందిన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు శాశ్వత అధ్యక్షులుగా ఉన్నారు. పురిపండా అప్పలస్వామి కార్యదర్శిగా ఉండేవారు. ఆ సాహిత్య సంస్థ పేరు - "కవితా సమితి". ఈ సంస్థను స్థాపించిన కవిత్రయాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఒకరు - వ్యావహారిక భాషోద్యమంలో గిడుగువారి అనుయాయులు, పులిపంజా విసిరిన శ్రీ పురిపండా అప్పలస్వామి (ఎడమనుంచి మొదటివారు) రెండవ వారు: 'ఈ శతాబ్దం నాది ' అన్న శబ్దబ్రహ్మ, అభ్యుదయ ఉద్యమ ప్రవక్త శ్రీ శ్రీ (మధ్యలో ఉన్నారు) మూడవ వ్యక్తి - 'దండాలు మా భరతమాత ' వంటి దేశ భక్తి గీతాలు రాసిన "స్వరాజ్య కవి" శ్రీ వడ్డాది సీతారామాంజనేయ కవి. ఈ సంస్థ 1926 మే 6 న స్థాపించబడింది. శ్రీ శ్రీ యుగకర్తగా మారటానికి ఈ సంస్థ ప్రేరణ నిచ్చింది. |
www.maganti.org All Rights Reserved |