" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
భావకవిగా, చారిత్రక నవలా రచయితగా అడవి బాపిరాజు గారు సుప్రసిద్ధులు. అంతేకాదు ఆయన గొప్ప చిత్రకారులు కూడా ! "శశికళ" అనే ఖండ కావ్యం బాపిరాజుగారిని మంచి కవిగా నిలబెట్టింది. అందులో "ఎండిమియాన్" అనే ఖండిక ఉంది. బాపిరాజుగారు అజంతా లోయలలో విహరిస్తూ అక్కడి ప్రకృతి రామణీయతకి, శిల్పకళావైభవానికి ప్రవశించిపోయారు. మూడు వేల సంవత్సరాల క్రితమే ఎండిమియన్ అనే గ్రీకు బాలుడు శశికళను ఆరాధించాడట ! ఇప్పటి బాపిరాజుగారే అప్పటి ఎండిమియన్ ! ఈ గేయాన్ని రాసి బాపిరాజుగారు తమ చిత్రకళా గురువైన కూల్డ్రే దొరకు పంపారు. ఆయన గేయం చదివి ముగ్ధులై గీసిన చిత్రమిది ! కూల్డ్రే గారే దీనికి "అజంతా లోయలో బాపిరాజు" అని శీర్షిక పెట్టారు. "నిదురపోయేనన్నుచూచీ నాపైవాలిన నిన్నుచూచీ గురువు కూల్డ్రే చిత్రం లిఖియించె" అని బాపిరాజు గారే పులకించిపోయారు. |
www.maganti.org All Rights Reserved |