" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఆధునిక సాహిత్య నిర్మాత, నవయుగవైతాళికుడు అనటానికి గల అనేక సాక్ష్యాలలో ఒకటి పత్రికా నిర్వహణ ! వీరి "వివేకవర్ధని" పత్రిక గురించి చాలా మందికి తెలుసు. కాని ఈ చిత్రంలో కనిపించేది "చింతామణి" పత్రిక ! 1890 లో కందుకూరి ప్రారంభించిన ఈ పత్రికకి చాలాకాలం "ఆంధ్ర భీష్మ" న్యాపతి సుబ్బారావు గారు సంపాదకులుగా ఉండేవారు. నిడదవోలు వెంకటరావు గారు ఇలా అన్నారు -

"He was also the first to conceive the idea in 1892 of a prize for writing a novel. The prize winning novels were printed in the 'Chintamani'. It is only on account of this encouragement that Chilakamarti began his career as a novelist"

తెలుగులో మొట్టమొదటగా - 1894లోనే - నవలలపోటీ నిర్వహించిన పత్రిక 'చింతామణి '. ఈ పోటీలో చిలకమర్తివారి "రామచంద్రవిజయం" నవలకి ప్రధమ బహుమతి లభించింది.
www.maganti.org
All Rights Reserved