" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
చెన్నపట్నంలో తెలుగు ముద్రణాలయం స్థాపించి ఎన్నో అమూల్యమైన కావ్యాలను, గ్రంధాలను ముద్రించి అపారమైన సేవ చేసిన మహనీయుని చిత్రమిది. "చేతివ్రాత పుస్తకములు చదువుకొనే రోజుల్లో ముద్రణాలయమును స్థాపించి చదువరుల కష్టములను తీర్చిరి" అని సి.పి.బ్రౌన్ దొర చేత ప్రశంసలు పొందిన భాషాసేవకుడీయన ! ఈయన వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు ! "భాగవతం రాసిందెవరండీ" ? అని అడిగితే "వావిళ్ళ వారు కాదూ" - అనేవారట ఒకనాడు "ఆది సరస్వతీ ముద్రాలయం" స్థాపించి 1854-62 మధ్యలోనే యాభై పుస్తకాలు ముద్రించిన వావిళ్ళ సంస్థ - 1906 లో రామస్వామి శాస్త్రి గారి కుమారులు వేంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో ' వావిళ్ళ ముద్రణాలయం ' గా మారి తెలుగు భాషా సాహిత్యాలకు అనుపమానమైన సేవ చేసిన వావిళ్ళ సంస్థ . . . . . . . . చివరకు ఆర్ధిక ఇబ్బందులకు గురై దీనస్థితికి చేరుకుంది. ఇదీ మనవారి స్థితి ! |
www.maganti.org All Rights Reserved |