" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
'తమ శక్తులను స్త్రీల సమస్యలపై కేంద్రీకరించి, సంఘం వారిపట్ల ప్రదర్శిస్తున్న వైఖరికి విసిగి మనలో ఏర్పడిన ద్వంద్వ ప్రమాణాలకు ఆగ్రహించి మనల్ని సంస్కరించడానికి అకుంఠిత దీక్షతో పోరాడిన" వీరులలో ఒకరుగా పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పేర్కొన్న సంచలన వచన రచయితను ఈ చిత్రంలో చూస్తాం. బాల్య వివాహాలు జరుగుతున్నకాలం నాటి చిత్రమిది. ఇందులో కనిపించే పెళ్ళికొడుకు 1894 లో పుట్టాడు. పెళ్ళికూతురు విజయవాడ వాస్తవ్యు లైన ఉప్పులూరి రామశేషయ్య గారి కుమార్తె - రంగనాయకమ్మ. 1910 నాటి ఈ పెళ్ళి బొమ్మలో ఉన్నది ఫదహారేళ్ళ వయసు గల గుడిపాటి వెంకట చలం (తెలుగు వెలుగు చలం పుస్తకం ఆధారంగా) |
www.maganti.org All Rights Reserved |