" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
సాహిత్య సభలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఆయితే వాటిల్లో గుర్తుండేవి, తప్పకుండా గుర్తుపెట్టుకోదగినవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ చిత్రం ఒకటి. ఇందులో కనిపించే ఇద్దరూ ఇద్దరే ! ఒకరు కవిత్వాన్ని బంగారంగా భావిస్తే మరొకరు అంగారంగా బావించారు. 'కవిత్వం ఛందస్సులోనే వ్రాయవలయును ' అని ఒకరంటే - 'ఛందస్సుల సర్ప పరిష్వంగం ' వద్దంటారు మరొకరు. ఈ ఇద్దరూ ఎప్పుడూ ప్రశ్నార్ధకాలే ! ఆశ్చర్యార్ధకాలే ! ఒకరు దక్షిణ ధృవం - మరొకరు ఉత్తర ధృవం ! ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది - కానీ దారులు వేరు !! వీరు - ఒకరు విశ్వనాధ (ఎడమ), మరొకరు శ్రీ శ్రీ ! |
www.maganti.org All Rights Reserved |