" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఈ చిత్రంలో కనిపించే వ్యక్రి చరిత్రను ఒక మలుపు తిప్పిన ఆర్ధిక శాస్త్రవేత్త. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులవల్లనే మానవుడి పురోభివృద్ధి ఆధారపడి ఉందని సరికొత్త భాష్యం చెప్పి అందర్నీ జాగృత పరిచిన మహానుభావుడీయన. సోషలిజం ప్రవక్తగా జే జేలందుకున్న ఈయన 1818 - మే 5వ తేదీన జన్మించాడు. ఇంతకీ ఈ తత్వవేత్త ఎవరో తెలుసా - కారల్ మార్క్స్ ! 1861 నాటి మార్క్స్ చిత్రమిది. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపు ఊపిన మార్క్సిజానికి ఈయనే మూలపురుషుడు. మార్క్సిజం విజయవంతమైందా - విఫలమైందా అన్నది పక్కన పెడితే - మార్క్సిజం ప్రభావంతో వెలువడిన తెలుగు సాహిత్యం తక్కువేమీకాదు !
www.maganti.org
All Rights Reserved