" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఒకనాడు కవి పండిత మహాసభలు, నవ్యసాహిత్య పరిషత్ మహాసభలు, అభ్యుదయరచయితలసంఘం మహాసభలు చాలాబాగా జరిగేవి. అప్పటి ఆ వాతావరణమే వేరు. ఆ సభలు ఎందరికో స్ఫూర్తినిచ్చేవి. 1948 లో చోడవరంలో జరిగిన కవి పండిత సభల సందర్భంగా సాహితీ దిగ్గజాలతో కూడిన ఛాయాచిత్రమిది.

ఎడమనుంచి కుడికి :
దిగువ కూర్చున్నవారు : 1. ఒక అమ్మాయి, 2. వెలివలి వీర రాఘవస్వామి, 3. భమిడిపాటి రామసోమ యాజులు (సభల నిర్వాహకులు), 4. వేదుల సత్యనారాయణ శాస్త్రి, 5. పిలకా గణపతి శాస్త్రి, 6. ఒక అమ్మాయి

మధ్యలో కూర్చున్నవారు : 1. వేదాల తిరువెంగళాచార్యులు, 2. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, 3. ఇచ్హాపురపు యజ్ఞ నారాయణ, 4. మారేపల్లి రామచంద్ర శాస్త్రి, 5. తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి(స్వామి), 6. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, 7. చిలుకూరి నారాయణ రావు, 8. వాసా సూర్యనారాయణ శాస్త్రి.

నిల్చున్న వారు : 1. తెలుగు పండితులు, 2. తెలుగు పండితులు, 3. బొమ్మకంటి వేంకట శ్రీనివాసాచార్యులు, 4. బొమ్మకంటి వేంకట సింగరాచార్యులు, 5. దేవగుప్తాపు విశ్వేశ్వర రావు (సభల సంచాలకులు) 5. బరంపురం వాస్తవ్యులు, 6. దర్భా రామశాస్త్రి (రాం షా) 7. మసూనా (మండా సూర్యనారాయణ), 8. ఒక బరంపురం వాసి, 9. మల్లాది శివరాం
www.maganti.org
All Rights Reserved