" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


బాగా ప్రసిద్ధి పొందినప్పుడు ఆ రచయిత 'చిత్రం ' కూడా ప్రసిద్ధంగానే ఉంటుంది. కాని ఆయన యవ్వనంలో లేదా బాల్యం లో ఎలా ఉండేవారో చూసినప్పుడు ఆ చిత్రం విచిత్రం అవుతుంది. అటువంటి విచిత్ర చిత్రమే ఇది !

ఈ చిత్రంలో ఉన్నది ప్రసిద్ధ కధా రచయిత ! తక్కువ కధలు రాసినా గొప్ప కధకుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందారు ! ఒకనాడు విప్లవ రచయితల సంఘంలో సభ్యులు కూడా ! శ్రీకాకుళంలో ' కధానిలయం ' అనే విశిష్ట గ్రంధాలయం స్థాపించారు. ఈ పాటికి గ్రహించే ఉంటారు యజ్ఞం కధా రచయిత ' కారా ' మేష్టారని - కాళీపట్నం రామారావు గారని ! ఆయన బాల్యంలో ఉన్నప్పటి ముగ్ధత్వం గల చిత్రం ఇది.

www.maganti.org
All Rights Reserved