" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఆంధ్ర నాటకరంగంలో ఎందరు నటీనటులున్నా ఆయనది ఒక ప్రత్యేక స్థానం ! నటకావతంస. నటశేఖర, 'ఆంధ్రబాలగంధర్వ ' వంటి బిరుదులున్నా ఆ బిరుదులకు అతీతుడాయన. పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలలో దేనినైనా అద్భుతంగా పోషించగల దిట్ట.

అంతేకాదు స్త్రీ పాత్రల్ని ధరించటంలో ఆయనకు ఆయనే సాటి. స్త్రీ పాత్ర వేస్తే నిజంగా స్త్రీ అనుకొని వెంటపడినవారున్నారంటే ఆ పాత్రలో ఎంతలా రాణించారో తెలుస్తుంది. ఆయన 'పద్మశ్రీ' స్థానం నరసిమ్హారవుగారు. పద్యకవిత్వం కూడా రాశారు.

కొప్పరపు సుబ్బారావు రాసిన 'రోషనార ' నాటకంలో 'రోషనార ' పాత్రలో స్థానం వారిని ఈ చిత్రంలో చూస్తున్నారు.
www.maganti.org
All Rights Reserved