" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఈ చిత్రంలో కనిపించే దంపతులిద్దరూ ఆదర్శవంతులే ! ఇద్దరూ సమాజ శ్రేయస్సును ఆకాంక్షించినవారే ! నూరు సంవత్సరాల నాటి వేషధారణలో ఉన్న వీరిద్దరూ సంఘసంస్కరణాభిలాషులే. ఎంతటి ప్రతిభావంతుడైనా, కార్య దీక్షుడైనా అర్ధాంగి సహకారం లేకపోతే హుళక్కి ! వీరిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉన్నారు. సమాజంలోని మౌఢ్యన్ని పారద్రోలి అపర రాజా రామ్మోహన రాయలుగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులుగారిని - ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మమ్మగారిని ఈ చిత్రం చూడవచ్చు.

"రాజ్యలక్ష్మమ్మగారు లేకపోతే కందుకూరివారు అంతటి మహత్తర కార్యక్రమాల్ని చేయకలిగేవారు కారేమో" అన్నారు కనుపర్తి వర లక్ష్మమ్మగారు.
www.maganti.org
All Rights Reserved