" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


"ఏ సాహితీ ప్రక్రియలోనైనా స్వతంత్ర ప్రతిభావంతుడు, నవ్యులలో అతి నవ్యుడు, జీవితంలోనూ సాహిత్యంలోనూ అరాచకం ఆయనకు పర్యాయవాచకం" అని కె.వి. రమణారెడ్డిగారిచేత బేరీజు వేయించుకున్న రచయితను ఈ చిత్రంలో చూస్తున్నారు.

ఈయన శ్రీ శ్రీ కి సహచరుడు. కొడవటిగంటి కుటుంబరావు కి బంధువట ! "సిపాయి కధలు" ద్వారా కధకుడిగా పేరు పొందారు. చాలామంది అభిప్రాయాలను బట్టి, లభించిన ఆధారాలను బట్టి వచన కవితకు ఆద్యుడీయన ! "నవమి చిలుక", "విష్ణుధనువు" అనే తొలి వచన కవితా సంపుటాలు వీరివే ! 1928 - 30 మధ్యనే వచన కవితలు రాసిన ఈయన ఎవరో తెలుసా ?

శిష్ట్లా ఉమామహేశ్వరరావు (1912-1952)

www.maganti.org
All Rights Reserved