" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


"పండితుడు. భాషావేత్త. తెలుగునలువ. సంస్కర్త. దేశనాయకుడు. నటుడు. నాట్యాచార్యుడు. నీతిమంతుడు. విశాఖలో కిరీటం లేని సమ్రాట్టు. ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిందక్కడ"

- అని పురిపండా అప్పలస్వామి గొప్పగా ప్రశంసించిన కవిగారిని ఈ చిత్రంలో చూస్తున్నారు. 'కవితా సమితి' కి ఈయన శాశ్వత అధ్యక్షులుగా ఉన్నారు. శ్రీ శ్రీ, పురిపండా మొదలైనవారెందరో ఈయన నుంచి స్ఫూర్తి పొందారు. తెన్నేటి విశ్వనాధం వంటి వారికి ఆదర్శ ప్రాయులయ్యారు. విశాఖపట్నంలో "హిందూ రీడింగ్ రూం" నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 'తెలుగో తెలుగో ' అని కలవరించి, పలవరించి "నుడికడలి" నిఘంటువును రూపొందించారు - అయితే అముద్రితం ! దేశంకోసం కుటుంబాన్ని పట్టించుకోని నిస్వార్ధ జీవి - మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారిని ఈ చిత్రంలో చూస్తున్నారు.
www.maganti.org
All Rights Reserved