" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమాన్ని ఆయన తర్వాత కొనసాగించిన వాడుకభాషా యోధుడు ఈ చిత్రంలో కనిపిస్తారు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి (కవిగారు) గారంటే ఈయనకి ప్రాణం. వాడుక భాషలో భారత రామాయణాలు రాశాడు. ఒరియా కధల్ని తెనిగించాడు. అంతేకాదు - మొట్టమొదటగా శ్రీ శ్రీ కవితను అచ్చువేయించాడు - ప్రభవ కావ్యాన్ని ప్రచురించాడు. 'పులిపంజా' విసిరాడు. అభ్యుదయ ఉద్యమానికి అంకితమయ్యాడు. ఎవరో గుర్తు పట్టారా ? ఆయనే పురిపండా అప్పలస్వామి |
www.maganti.org All Rights Reserved |