" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


" కన్నియను పెండ్లియాడునో ?
కన్నెతండ్రి యర్పణము జేయు శుల్కరూపాప్సర
సను పెండ్లి యాడునో యకట యీ పెండ్లికొడుకు ? "


అంటూ మొట్టమొదటగా వరకట్నానికి నిరసనగా "కోకిలస్వామి" రాయప్రోలు సుబ్బారావు గారు "స్నేహలత" ఖండ కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం ఆవిర్భవించడానికి వాస్తవ సంఘటన మూలం. 1914 లో వరకట్న పిశాచానికి ఆత్మార్పణ చేసుకొన్న స్నేహలత కన్య వృత్తాంతం ఒక దిన పత్రికలో వచ్చింది. ఆ వార్తను గజవల్లి రామచంద్రరావు గారు రాయప్రోలు సుబ్బారావు గారికి చదివి వినిపించారు. జ్వరంతో ఉన్న రాయప్రోలువారి మనసు వికలమైంది. "స్నేహలత" కావ్యాన్ని రాయకుండా ఉండలేకపోయారు. ఈ కావ్యాన్ని 'దేశోద్ధారక' కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రచురించారు. "ఆంగ్ల సారస్వతమునందలి జూలియట్టు వలె మృత్యువునకు ఈమె జంక లేదు" అన్నారు రాయప్రోలు. వెంపరాల సుబ్రహ్మణ్యం గారు ఈ 'స్నేహలత" నాటకాన్ని రచించినట్లు తెలుస్తోంది. రాయప్రోలు వారి ఈ 'స్నేహలత" కావ్యం తొలి స్మృతి కావ్యం (ఎలిజీ) కావచ్చు. అమ్మా నాన్నలు తన పెళ్ళికి ఇల్లు అమ్మేస్తున్న సంగతి తెలుసుకొని ఆత్మాహుతి చేసుకొన్న "స్నేహలత" ను పై చిత్రం లో చూడవచ్చు. రాయప్రోలు వారి సామాజిక స్పృహకి ఈ కావ్యం మచ్చు తునక !
www.maganti.org
All Rights Reserved