" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "

చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్
శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

నవల, వైవిధ్యానికి వైశిష్ట్యానికి చిహ్నంగా నిలిచే సాహితీ ప్రక్రియ. ఇది ఆంగ్ల భాషా ప్రభావం వల్ల బాగా వ్యాప్తికి వచ్చిన ప్రక్రియ. దీనిని ఆంగ్లంలొ “నావల్”, కన్నడంలో “కాదంబరి”, హిందీలో “ఉపన్యాస్” అంటారు. ఆదిలో నవలను- నవీన ప్రబంధం (నరహరి గోపాల కృష్ణమ సెట్టి), వచన ప్రబంధం (కందుకూరి) అన్నారు.. గవర్నర్ జెనెరల్-లార్డ్ మేయో ప్రకటన మేరకు నరహరి గోపాల కృష్ణమ సెట్టి రాసిన శ్రీ రంగరాజ చరిత్ర (సోనాబాయి పరిణయం) తెలుగులో మొదటి నవల (1872). ఈ నవల అంతగా వ్యాప్తిలోకి రాలేదు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులు రచన రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక)కు బాగా ప్రాచుర్యం లభించింది (1878). ఈ ప్రక్రియకు “నవల" అని నామకరణం చేసినవారు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి.