" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "

చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్
ఆచార్య బిరుదురాజు రామరాజు - భారతీయ విశ్వవిద్యాలయాల్లోని ఆదర్శప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఒకరు ఆచార్య బిరుదురాజు రామరాజు. భారతదేశ జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగునాట విశ్వవిద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసినవారు