గడియలోపల తాడి కడగి ముత్తునీయగా తిట్టిన మేధావిభట్టు కంటె
రెండు గడెల బ్రహ్మదండి ముండ్లన్నియు - డుల్ల దిట్టిన కవిమల్లుకంటె
మూడు గడియలకు మొనసి యత్తిన గండి - పగుల దిట్టిన కవిభాను కంటె
అరజాము లోపల చెరువు నీళ్ళింకంగ - దిట్టిన బడబాగ్ని భట్టు కంటె
ఉగ్రకోపి నేను ఓపుదు శపియింప ; క్రమ్మరింప శక్తి కలదు నాకు
వట్టి మ్రాన జిగురు బుట్టింప, గిట్టింప ; బిరుదు వేములాడ భీమకవిని

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి