గరళపు ముద్ద లోహ మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి ఉరగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయి లయకాలుడు కమ్మరి వైరి వీరసం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి