వేయి గజంబు లుండ పదివేలు తురంగము లుండ ఆజిలో
రాయల గెల్చి సజ్జ నగరంబున పట్టము గట్టుకో వడిన్
రాయ కళింగ గంగు; కవిరాజ భయంకరమూర్తి చూడ తా
పోయిన మీన మాసమున పున్నమ వోయిన షష్ఠి నాటికిన్

______________________________
కవి / కర్త - వేములవాడ భీమ కవి