ఒకని కవిత్వమం దెనయు ఒప్పులు తప్పులు ? నా కవిత్వమం
దొకనికి తప్పు పట్టపని యుండదు; కాదని తప్పు పట్టినన్
మొకమటు క్రిందుగా తిగిచి ముక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట కోయుదును, చెప్పున కొట్టుదు, మోము తన్నుదున్

______________________________
కవి / కర్త - తెనాలి రామకృష్ణుడు