అంగడివీథి పల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్
జంగమువారి చిన్నది పిసాళితనంబున జూచెబో నిశా
తాంగజ బాణ కైరవ సితాంబుజ మత్త చకోర బాల సా
రంగ తటిన్నికాయముల రంతులు సేసెడు వాడిచూపులన్

______________________
కవి/కర్త - శ్రీనాథుడు