వనజాతాంబకు డేయు సాయకముల న్వారింపగా రాదు నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయ ది
ట్లనురక్తిన్ మిముబోంట్లకు దెలుప నాహా సిగ్గు మైకోదు పా
వన వంశంబు స్వతంత్ర మీయదు సఖీ వాంఛల్తుద ల్ముట్టునే

______________________
కవి/కర్త - శ్రీనాథుడు