చేకొని యాచకత్వమున చేసి దిగంతరాళికిన్
పోకయు రాక తీర; దది బుద్ధికి కల్గిన మోసమై స్వయం
పాకపు నిష్ఠ అంచు ప్రతిబంధక మొక్కటి తెచ్చికొంటి నే
నాకటి కోర్వ, వంట కసమర్థుడ; శిష్యులు కూడిరారు, 'తా
జాకల ' మౌనుగాని కొనసాగెడు చందము తోచదీశ్వరా!

______________________________
కవి / కర్త - కొట్ర వెంకటేశ్వర్లు