వేదాంతముల తోడ వెక్కిరింతల తోడ - లెక్చర్ల సాగించు లీలనెవడు
లక్ష్యమొక్కటి లేక యక్షగానములతో - కాలంబు వృథ పుచ్చు ఘను డెవండు
చీరాల పేరాల చిన్ని గ్రామంబుల - దోస మెన్నక కొంప తీసెనెవడు
ఆంధ్రరత్నం బంచు అహమికతో పెద్ద - పిన్నలంచును మది నెన్నడెవడు

______________________________
కవి / కర్త - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య