వేసవి డగ్గరాయె, మిము వీడుటకున్ మనసొగ్గదాయె, మా
వాసము దూరమాయె, బరవాస మొనర్చుట భారమాయె, మా
కోసము తల్లి దండ్రు లిదిగో నదిగో నని చూచుటాయె, వి
శ్వాస మెలర్పవే సెల వొసంగినఁబోయెదమయ్య భూవరా!

______________________________
కవి / కర్త - తిరుపతి వేంకటకవులు