రెండు కాకులు కూర్చుండె బండమీద
ఒండెగిరిపోయె; అంత అందొండు మిగిలె
రెండవదిపోయె; పిదప అందొండు లేదు
బండ మాత్రము పాపమందుండిపోయె

______________________________
కవి / కర్త - అనంతపంతుల రామస్వామి