వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవి చౌడప్పా !

______________________
కవి/కర్త - కవి చౌడప్ప