కమలజకృష్ణశంకరులు కాంచననీలపటీరువర్ణు లా
గమనచంద్రధారు లఘుకంసపురారులు హంసతార్క్ష్యగో
గమనులు జన్మపుష్టిలయకారులు వాక్కమలాబికేశ్వరుల్
శమకరుణావిభూతిగుణశక్తుల బ్రోతురు మిమ్ము నెప్పుడున్

______________________
త్రిమూర్తి స్తుతి