పాయని వేడ్కతో కుసుమ బాణములన్ గురిపించె సూర్య నా
రాయణరాజుపై జయపురమ్మున మన్మథ ధూర్తు డక్కటా
ఏయమ పున్నెమో యఘమొ యిన్యునుం జలియింప లేదు బీ
ర్కాయలెగాని కామినుల కౌగిళు లక్కర లేదు వారికిన్
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు